శ్రీరెడ్డి లీక్స్ : అతడు టాలీవుడ్ డర్టీ హీరో.. ప్రతి అమ్మాయి కావాలి !

నటి శ్రీరెడ్డి లీక్స్ మరోసారి టాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయ్. ఇటీవలే టాలీవుడ్ పై ఓ రౌండ్ వేసింది. ఇండస్ట్రీలోని హీరోలు, నిర్మాతలు, హీరోయిన్స్ పై షాకింగ్ ఆరోపణలు చేసింది. కాస్త గ్యాప్ తర్వాత కోలీవుడ్ ని తగులుకొంది. రాఘవ లారెన్స్, హీరో శ్రీరామ్ పై ఆరోపణలు చేసింది. సినిమా అవకాశాలు ఇప్పిస్తామని తనని వాడుకొన్నారని ఆరోపించింది. ఇప్పుడు శ్రీరెడ్డి దృష్టి మళ్లీ టాలీవుడ్ పై పడింది. ఓ నిర్మాత, ఓ యంగ్ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ బండారం బయటపెట్టింది. అతడు డర్టీ పర్సన్. ప్రతి మహిళని కోరుకుంటాడని ఆరోపించింది. ఇక, మహిళలతో పెట్టుకుని రాజ్యాలే పోగుట్టుకున్న వారు చరిత్రలో ఉన్నారు. ఇక మీ స్టూడియోలు ఎంత.. మీ బతుకులు ఎంత అంటూ పరోక్షంగా ఓ నిర్మాతని ఉద్దేశించి చేసింది. ఐతే, ఆ నిర్మాత పేరు మాత్రం బయటపెట్టలేదు. ఇప్పుడా నిర్మాత ఎవరనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.