ఎంసెట్ 2 లీకేజ్ కేసులో కస్టడీకి నిందితులు…
ఎంసెట్ 2 లీకేజీ కేసులో నిందితులకు నాలుగు రోజుల కస్టడీ విధించారు. వాసు బాబు, శివ నారాయణని నాలుగవ రోజు ప్రశ్నించారు సీఐడీ అధికారులు. బ్రోకర్ల తో శివనారయణ,వాసుబాబు సంభందాలపై ఆరా తీశారు. బ్రోకర్ల ను పిలిచి మళ్ళీ విచారించనున్నారు. నిందితులను శనివారం కటక్ తరలించి విచారించనున్నారు. లీకేజ్ కేసులో పరారీలో మరో 15 మంది పాత్రపై సీఐడీ విచారణ చేపట్టింది.
కార్పోరేట్ కళాశాల పూర్వ విద్యార్ధులతో నిందితులు ఎందుకు టచ్ లో ఉన్నారో సీఐడీ ఆరా తీస్తోంది. లీకైన ప్రశ్న పత్రం ర్యాంక్ లు సాధించిన విద్యార్థులు తల్లిదండ్రులను పిలిచి విచారిస్తున్నారు. ఎంసెట్ పేపర్ లీకేజ్ వెనకాల కీలక సూత్రదారులపై దృఫ్టి సారించింది సీఐడీ. ఎంసెట్ స్కామ్ లో అరెస్ట్ అయిన గణేష్ ప్రసాద్ కస్టడీ పిటిషన్ పై సోమవారం నాంపల్లి కోర్టు విచారించనుంది.