లిప్ లాక్ సీన్.. 3 సినిమాలని దూరం చేసింది
ముద్దంటే ఎవరికి చేధు. అది ఇచ్చేవారికి.. చూసే వారికి కిక్కునిస్తుంది. అందుకే మన దర్శక-నిర్మాతలు సినిమాలో మూడు ముద్దులు, ఆరు హగ్గులు ఉండేలా జాగ్రత్తపడుతుంటారు. అందులోనూ లిప్ లాక్ సీన్ కు ఉండే డిమాండ్ యే వేరు. అవి ఇచ్చేందుకు రెడీగా ఉండే హీరోయిన్స్ భలే గిరాకీ ఉంటుందనుకోండీ.. ! ఐతే, ఇదే లిప్ లాక్ తనకి మూడు సినిమా ఛాన్సులని మిస్ చేసిందని బాధపడుతోంది ‘ప్రేమమ్’ హీరోయిన్ మడోనా సెబాస్టియన్.
ఈ మళయాళ భామ తెలుగు, కన్నడ బాషల్లో నటించేందుకు రెడీగా ఉందట. బాషా బేధం అస్సలు పట్టించుకోను. కాకపోతే నాకు ముద్దంటే చేధు. లిప్ లాక్ లకు దూరం. లిప్ లాక్ సీన్లకు అంగీకరించక పోవడంతో మూడు పెద్ద చిత్రాల్లో నటించే చాన్స్ ను పోగొట్టుకున్నానని చెబుతోంది. తొలిసారి కౌగిలింత సీన్ చేసేందుకు కంగారు పడ్డా.. ఏడ్చేశాను చెప్పింది. లిప్ లాక్ ల భయం పోవాలంటే త్వరగా ప్రేమలో పడమని కొందరు ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారంట. ఇదీ.. నిజమే మరీ.. !
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విజయ్ సేతుపతి సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులో ఆమెది 5 నిమిషాల పాత్రే. కానీ, గుర్తిండిపోయే పాత్రని చెబుతున్నారు.