తిరుమల దర్శనం రద్దుపై టీటీడీ పునఃసమీక్ష…!!
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆగస్టులో తొమ్మిది రోజులపాటు భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం నేపథ్యంలో టీటీడీ ఈవో సింఘాల్ స్పందించారు. మహాసంప్రోక్షణ సమయంలో ఎక్కువ మంది భక్తులుకు దర్శనం కల్పించలేని పరిస్థితి ఉందని, శెలవు రోజులు కావడంతో ఎక్కువ మంది భక్తులు తరలివస్తే, భక్తులుకు ఇబ్బంది కలుగుతుందని దర్శనాలు రద్దు చెయ్యాలని పాలకమండలి నిర్ణయించిందని ఆయన తెలిపారు.
తిరుమల దర్శనాల రద్దుపై కొంత మంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసారని ఈవో అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకూండా నిర్ణయాలను పున:సమిక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన తెలిపారు. ఆగస్టు 11వ తేదిన 9 గంటలు, 12వ తేదిన 4 గంటలు, 13వ తేదిన 4గంటలు, 14వ తేదిన 5గంటలు, 15వ తేదిన 5గంటలు, 16వ తేదిన 4గంటలు మాత్రమే భక్తులు దర్శనం కల్పించవచ్చని ఆయన అన్నారు. భక్తుల అభిప్రాయాలు తీసుకోని సంప్రోక్షణ సమయంలో దర్శనవిధి విధానాలును పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 24 న జరిగే పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.