బిగ్ బాస్’ని చూడటం టైం వేస్ట్

బిగ్ బాస్ తెలుగులోనూ సూపర్ హిట్ అనిపించుకొన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ సీజన్ – 1 సూపర్ హిట్టయ్యింది. రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ ని సొంతం చేసుకొంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 2 ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. సీజన్ 1 రేంజ్ లో సీజన్ 2 లేకున్నా.. బాగానే లాభాలని తెచ్చిపెడుతుందని బిగ్ బాస్ నిర్వాహకులు చెబుతున్నారు.

ఇప్పుడీ పాపులర్ షో పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. అసలు బిగ్ బాస్ షోని చూడటం టైం వేస్ట్ అన్నారాయన. ‘ఈ షో మొత్తం బిగ్ బాస్ చెప్పినట్టు నడుస్తుంటుంది. అందరి మైండ్ లను బిగ్ బాస్ కంట్రోల్ చేస్తుంటాడు. బిగ్ బాస్ ను మాత్రం ఎవరూ కంట్రోల్ చేయరు’ అన్నారు జేడీ. మన మైండ్ ను మనమే కంట్రోల్ చేసుకోవాలంటే ప్రాణాయామం చేయాలని సూచించారు. యువతని ఉద్దేశించిన ప్రసంగిస్తూ.. బిగ్ బాస్ ని టార్గెట్ చేశారు జేడీ. బహుశా.. ఈ వారం తర్వాత బిగ్ బాస్ సీజన్ 2 టీఆర్పీ రేటింగ్స్ తగ్గినట్టయితే.. అది జేడీ ప్రభావమేననే చెప్పొచ్చేమో.. !!