అందుకే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు…!!

అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అనుమతి ఇచ్చారని, చర్చకు సమయం ఇస్తామని స్పీక‌ర్ తెలిపార‌ని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. అవిశ్వాసం తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు ఉంద‌ని ఆయ‌న తెలిపారు. బీజేపీ ఏం చేసిందో ఏపీ ప్రజ‌ల‌కే కాదు, భారత ప్రజాలందరికి తెలుస‌న్నారు. ప‌దేళ్ల పాటు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని బీజేపీ చెప్పింద‌ని, మొద‌టి నుంచీ టీడీపీ చెబుతున్న‌ట్లే బీజేపీ వైసీపీ కుట్ర‌లు చేస్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు.

అవిశ్వాస తీర్మానం వస్తుంద‌ని తెలిసే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని కేశినేని ఆరోపించారు. అవిశ్వాసం తీర్మాణం చ‌ర్చ‌కు రాగానే మొత్తం 14 అంశాల పై చర్చలో మాట్లాడతామన్నారాయ‌న‌. పోలవరానికి నిధులు,రైల్వే జోన్,రాజధాని నిర్మాణం అంశాలు అన్ని పెండింగ్ లో ఉన్నాయన్నారు. కేంద్రంపై పోరాటంలో ఖ‌చ్చితంగా ఏపీ విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.