దిల్ రాజు బ్యానర్’లో హరీష్’కు చోటు లేదు

దర్శకుడు హరీష్ శంకర్ కు దిల్ రాజు బ్యానర్ లో చోటు లేకుండా పోయింది. ఈ దర్శకుడు దిల్ రాజు బ్యానర్ లో 3 సినిమాలు చేశాడు. రామయ్య వస్తావయ్యా, సుబ్రమణ్యం ఫర్ సేల్, డీజే సినిమాలు దిల్ రాజు బ్యానర్ లో వచ్చినవే. ఇందులో ‘రామయ్యా వస్తావయ్యా’ ఒక్కటే ప్లాపు అయ్యింది. మిగితా రెండు సినిమాలు దిల్ రాజుకు మంచి లాభాలనే తెచ్చిపెట్టాయి. ఈ బ్యానర్ లో హరీష్ మరో సినిమా కూడా చేయాల్సి ఉంది.

‘డీజే’ విడుదల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇద్దరు యువహీరోలతో ఒక మల్టీస్టారర్ ఉంటుందని దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ కూడా తన నెక్స్ట్ సినిమా ‘దాగుడు మూతలు’ కోసం లోకేషన్ల వేటలో ఉన్నానని.. అప్పట్లో అమెరికా నుండి కొన్ని ఫోటోలు కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఆ ప్రకటన వచ్చి దాదాపు ఏడాది అయినా.. సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.

రీసెంట్ గా దిల్ రాజు బ్యానర్ నుండి రానున్న 5 సినిమాల విడుదల తేదీలను ప్రకటించడం జరిగింది. అందులో కూడా ‘దాగుడు మూతలు’ లేదు. లవర్ – జూలై 20 – 2018, శ్రీనివాసకల్యాణం – ఆగస్టు 9 – 2018, హలోగురు ప్రేమకోసమే -అక్టోబర్ 18 – 2018, ఎఫ్2 – జనవరి 12 – 2019, ఎస్ ఎస్ ఎంబీ25 – ఏప్రిల్ 5 2019 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ ప్రకటనపై హరీష్ శంకర్ స్పందించారు. “నా సినిమాను ఈ లిస్టు లో మిస్సయ్యాను. అదోలా ఫీలవుతున్నాను… కానీ కొన్ని సార్లు తప్పవు.. ఆ అయిదు సినిమాలకు నా హృదయపూర్వక శుభాభినందనలు” అంటూ ట్విట్ చేశాడు హరీష్. మరోవైపు, దిల్ రాజుకు హరీష్ శంకర్ కు స్క్రిప్ట్ విషయం లో అభిప్రాయభేదాలు వచ్చాయని తెలిసింద. దీంతో.. హరీష్ దిల్ రాజు కాంపౌండ్ నుండి బయటకు వచ్చాడట. ప్రస్తుతం ‘దాగుడు మూతలు’ సినిమాను వేరే నిర్మాతతో చేసే ప్రయత్నాల్లో హరీష్ శంకర్ ఉన్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్.