అవిశ్వాసంపై ప్ర‌ధాని ట్వీట్..!

కేంద్ర‌ప్ర‌భుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మాణం ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం అవిశ్వాసంపై చ‌ర్చ‌కు స‌మ‌య‌మిచ్చారు స్పీక‌ర్. ఇప్ప‌టికే ఎన్డీయేయేత‌ర పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టిన టీడీపీ పార్ల‌మెంటులో త‌మ వాణి వినిపించేందుకు అన్నిర‌కాలుగా సిద్ధ‌మైంది. టీడీపీ నేత‌లే కాదు ప్ర‌ధాని కూడా ఈరోజును ఎంతో ముఖ్య‌మైన‌దిగా భావిస్తూ ట్వీట్ చేశారు.

ఇవాళ ఎంతో ముఖ్య‌మైన రోజని, పార్ల‌మెంటులో అవిశ్వాసంపై చర్చ స‌జావుగా సాగుతుంద‌ని ఆశిస్తున్నాన‌నంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. దేశ ప్ర‌జ‌లు నిశితంగా చూస్తున్నారంటూ ట్వీట్ లోపేర్కొన్నారు. బ‌లాబ‌లాలు, అవిశ్వాసం నెగ్గ‌టం సంగ‌తి ఎలా ఉన్నా, పార్ల‌మెంటులో ఎంపీల వాయిస్ పై ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌నేది మాత్రం నిజం. ప్ర‌ధాని ట్వీట్ తో పార్ల‌మెంటులో జ‌రిగే అవిశ్వాస చ‌ర్చ‌పై మ‌రింత ఆస‌క్తిని, హీట్ ను పెంచుతోంది.