టీఆర్ఎస్ టైం 9నిమిషాలు
కేంద్రంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై లోక్ సభలో మరికాసేపట్లో చర్చ మొదలు కానుంది. ఈ అవిశ్వాసంలో ఓడిపోతామన్న భయం అధికార పక్షానికి లేదు. గెలుస్తామన్న ధీమాలో విపక్షాలూ లేవు. ఐతే, రాజకీయంగా ఎలా పైచేయి సాధించాలన్నదే విపక్షాల లక్ష్యంగా కనిపిస్తోంది. అవిశ్వాసంపై దాదాపు 7గం॥ల పాటు చర్చ జరగనుంది. సాయంత్రం ఆరు గంటలకు ఓటింగ్ నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ 7గంటల సమయంలో ఏ పార్టీ ఎంత సేపు మాట్లాడన్న విషయాన్ని స్వీకర్ కేటాయించారు. ఇందులో టీఆర్ఎస్ పార్టీకి 9ని॥ల సమయాన్ని కేటాయించారు.
భాజాపా : 3.33గం॥ల, కాంగ్రెస్ కు 38 ని॥లు, అన్నాడీఎంకె 29ని॥లు, తృణముల్ కాంగ్రెస్ కు 27ని॥లు, బీజేడీ 17ని॥లు, శివసేన 14ని॥లు, టీడీపీ 13ని॥లు, తెరాస 9ని॥లు, సీపీఎం 7ని॥లు, ఎస్పీ 6ని॥లు, ఎన్ సీపీ 6ని॥లు, ఎల్ జె ఎస్ పీ 5ని॥లు కేటాయించారు. ఇతర పార్టీలకు 2ని॥ల చొప్పున అవకాశం ఇవ్వనున్నారు. ఇక, ఈ చర్చలో టీఆర్ఎస్ తటస్థంగా వ్యవహరించనుంది. భాజాపా, టీడీపీ, కాంగ్రెస్ లు తెలంగాణ పట్ల వ్యవహరించిన తీరుని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది. అవిశ్వాసంపై చర్చలో పార్టీ తరఫున జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్‌లు మాట్లాడాలని నిర్ణయించినట్లు సమాచారం.
స్పీకర్‌ను మినహాయించి 533 మంది ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభలో అవిశ్వాసం నెగ్గాలంటే అధికారపార్టీకి 267 మంది మద్దతు లభిస్తే సరిపోతుంది. సొంతంగానే 273 మంది బలం ఉన్న అధికారపార్టీకి మిత్రపక్షాలతో కలిపితే 316 మంది మద్దతు లభిస్తోంది. మరోవైపు అవిశ్వాసం ప్రతిపాదించిన ప్రతిపక్షాలకు 146 మందికి మించి బలం కనిపించడంలేదు. ఈ వాస్తవం అందరికీ ముందే తెలియడంతో గెలుపోటముల గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడంలేదు.