లోక్ సభలో.. ‘టీడీపీ వర్సెస్ టీఆర్ఎస్’ !
లోక్ సభలో కేంద్రంపై టీడీపీ ఇచ్చిన అవిశ్వాసంపై వాడి వేడి చర్చ జరుగుతోంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగిస్తున్నారు. ఏపీకి కేంద్రం ఏయే హామీలు ఇచ్చింది. ఎలా మోసం చేసింది.. ? అనే విషయాలని ప్రస్తావిస్తున్నారు గల్లా. ఈ క్రమంలో ఆయన విభజన జరిగిన విధానాన్ని ప్రస్తావించారు. పార్లమెంట తలుపులు మూసి రాష్ట్రాన్నిఅప్రజాస్వామికంగా విభజించారు. అప్రజాస్వామిక విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందని తన ప్రసంగంలో గల్లా తెలిపారు. ఐతే, రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా విభజించారన్న జయదేవ్ వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు.
జయదేవ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు తమనకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీలు కోరారు. అందుకు స్వీకర్ నిరాకరించారు. ఆస్తులు తెలంగాణకు.. అప్పులు ఏపీకి అన్న జయదేవ్ వ్యాఖ్యలు టీఆర్ ఎస్ ఎంపీలకు కోపాన్న్ని తెప్పించాయి. దీనిపై టీఆర్ఎస్ అధికారులు నిరసన తెలిపేందుకు రెడీ అయ్యారు. ఇంతలో జయదేవ్ ప్రసంగం కేంద్రంపై మళ్లీంది. ఇప్పటి వరకు కేంద్రం ఏపీకి ఎన్ని నిధులు ఇచ్చింది. ఇంకా ఎన్ని ఇవ్వాల్సిందన్న అంశాలు జయదేవ్ ప్రస్తావిస్తున్నారు. దీంతో పాటు.. ఏపీ విషయంలో ప్రధాని మోడీ.. ఆ తర్వాత ఆయన యు-టర్న్ తీసుకొన్న విషయాన్ని సభకు తెలిపారు. స్పెషల్ ప్యాకేజీ పేరు చెప్పి కేంద్రం మోసం చేసింది. ఆ మోసం కారణంగా ఎన్ డీయే నుంచి టీడీపీ బయటికొచ్చిందని తెలిపారు గల్లా.
మొత్తానికి.. అవిశ్వాసంపై చర్చలో కొన్ని నిమిషాలు టీడీపీ వర్సెస్ టీఆర్ఎస్ గా మారింది. గతంలో రాష్ట్ర విభజన సమయంలో ఇదే లోక్ సభ వేదికగా టీడీపీ, టీఆర్ ఎస్ కత్తులు దూసుకొన్నాయి. మళ్లీ చాన్నాళ్ల తర్వాత అదే సీన్ రిపీట్ అవుతుందని అందరు భావించారు. ఐతే, అది కొద్దిసేపే కావడంతో.. ఊపిరి పీల్చుకొన్నారు. ఇక, ఎంపీ జయదేవ్ ప్రసంగం పూర్తి కావొస్తోంది. ఈ చర్చలో టీడీపీ 13 నిమిషాలు, టీఆర్ ఎస్ 9 నిమిషాలు కేటాయించారు స్పీకర్.