రాహుల్‌.. ప్రియా వారియర్‌ను మరిపించావ్‌ !

శుక్రవారం లోక్ సభలో అవిశ్వాసంపై జరిగిన చర్చలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీసోడ్ హైలైట్ అయ్యింది. ప్రధాని మోడీని రాహుల్ ఆలింగనం చేసుకోవడం. తిరిగి తన సీటులోకి కూర్చోని సహచరణ సభ్యుడికి కన్నుకొట్టడం.. ఈ రెండు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కన్నుకొట్టడంలో రాహుల్.. హీరోయీన్ ప్రియా ప్రకాష్ వారియన్ మరిపించావ్ అని నెటిజర్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్-ప్రియావారియర్ కన్నుకొడుతున్న ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీటిపై నెటిజర్స్ ఆసక్తికరమైన కామెంట్స్ పెడుతున్నారు.

వాటిలో కొన్ని మీకోసం..

* ‘వాహ్‌ రాహుల్‌… ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను మరిపించావ్‌’

* ‘రాహుల్‌ మాట్లాడేదంతా నిజం కాదని ఆయన మరోసారి నిరూపించారు.’

* ‘రాహుల్‌… మోదీని ఆలింగనం చేసుకున్నారు. మీ పార్టీ నేతలకు కన్ను కొట్టారు. తర్వాత ఎవర్ని ఏంచేస్తారో?’

* ‘ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను బాగా ఫాలో అవుతున్నావా రాహుల్‌ జీ.. ఆమె కన్నుకొట్టిన వీడియోమరిన్ని సార్లు చూడండి. ఇంకా ఇంప్రూవ్‌ అవుతారు.’

* ‘రాహుల్‌ ప్రియా ప్రకాశ్‌ కంటే గొప్పగా కన్నుకొట్టగలరు. మున్నాభాయ్‌ కంటే ఇంకా గొప్పగా ఆలింగనం చేసుకోగలరు. ఇక ఆయనకేమీ రాదని ఎలా చెప్తాం?’

* ‘సోనియాజీ..రాహుల్‌ని జాగ్రత్తగా చూసుకోండి. ఆయన బహిరంగ ప్రదేశాల్లో కన్నుకొడుతున్నారు.’

* ‘ప్రియా ప్రకాశ్‌ వీడియోలు చూపించి రాహుల్‌ని దివ్యస్పందన బాగా తీర్చిదిద్దింది. ఆమె కష్టానికి ప్రతిఫలం ఈరోజు పార్లమెంట్‌లో కనిపించింది.’

* ‘రాహుల్‌ వర్సెస్‌ ప్రియా ప్రకాశ్‌.. ఇద్దరిలో ఎవరు బాగా కన్నుకొట్టారు?’