స్వర్ణం గెలిచిన లక్ష్యసేన్‌

యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి సత్తా చాటాడు. 16 యేళ్ల ఉత్తరాఖండ్‌ కెరటం లక్ష్యసేన్‌ ప్రపంచ జూనియర్‌ నంబర్‌వన్‌ కులావత్‌ వితిసన్‌ (థాయ్‌లాండ్‌) కు షాకిస్తూ.. టైటిల్‌ ను ఎగరేసుకుపోయాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 21-19, 21-18తో కులావత్‌ వితిసన్‌ ఓడించాడు. మన దేశం తరఫున ఈ టైటిల్‌ సాధించిన మూడో ఆటగాడు లక్ష్యసేన్. 53 యేళ్ల తర్వాత జూనియర్‌ పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం గెలిచిన భారత ఆటగాడిగా సేన్ చరిత్ర సృష్టించాడు.

స్వర్ణం గెలిచిన లక్ష్యసేన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. లక్ష్యసేన్‌ కు భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బాయ్‌) రూ.10 లక్షల నజరానా ప్రకటించింది. ‘‘లక్ష్యసేన్‌ దేశం గర్వించే ప్రదర్శన చేశాడు. యువ షట్లర్లను ప్రోత్సహిస్తున్నందుకు ఇప్పుడు ప్రతిఫలం దక్కుతోంది. అతని ప్రదర్శన మిగిలిన క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని సంఘం కార్యదర్శి అజయ్‌ సింఘానియా అన్నారు.