ఐడియా బంపర్ ఆఫర్

జియో పోటీ నుంచి తట్టుకొనేందుకు ఐడియా సెల్యులార్ కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా సరికొత్త ఆఫర్ ని తీసుకొచ్చింది. రూ.595 కి ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకునే ఐడియా కస్టమర్లకు 10 జీబీ ఫిక్స్‌డ్ మొబైల్ డేటా వస్తుందని, అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయని తెలిపింది. ఈ ప్లాన్ వాలిడిటీని 112 రోజులుగా నిర్ణయించారు. ఈ ప్లాన్‌లో కస్టమర్లు గరిష్టంగా రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల వాయిస్ కాల్స్‌ను చేసుకోవచ్చు. ఈ ప్లాన్ రెండు తెలుగు రాష్ర్టాలతోపాటు అస్సాం, బీహార్, హర్యానా, నార్త్ ఈస్ట్, రాజస్థాన్, యూపీ ఈస్ట్ సర్కిల్స్‌లోని కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.