సమంత ‘యు టర్న్’ ఫస్ట్ లుక్

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “యు టర్న్”. కన్నడ బ్లాక్‌ బస్టర్‌ ‘యు టర్న్‌’కు రిమేక్ ఇది. పవన్ కుమార్ దర్శకుడు. తాజాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. సీరియస్ లుక్ లో ఉన్న సమంత పిక్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలారు. ఈ మిస్టరీ థ్రిల్లర్‌ మూవీలో సమంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా కనిపించబోతోంది.

ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకొంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్‌ గా కనిపించనున్నారు. సీనియర్ హీరోయిన్ భూమిక, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ సామ్ యూ-టర్న్ రిలీజ్ కానుంది. నటన పరంగా ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాని సామ్ ఎంతో ఇష్టపడి చేసింది. మరీ.. ఆమె నమ్మకం ఏ మేరకు నెరవేరుతుందన్నది చూడాలి.