అరవింద సమేత.. ‘ఎమోషనల్ పిక్’ లీక్ !

త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ ‘అరవింద సమేత’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఫ్యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా, ఈ సినిమా నుంచి ఓ పిక్ లీకయ్యింది. లీకైన పోటోలో ఎన్టీఆర్, నాగబాబు ఇద్దరూ గాయాలతో కనిపిస్తున్నారు. గాయాలతో ఉన్న నాగబాబుని వాహనంలో తీసుకుని వెళుతూ ఎన్టీఆర్ ఎమోషనల్ గా చూస్తున్నాడు. ఎమోషనల్ నేపథ్యం ఉన్న ఈ పిక్ ని చూసి నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు. అదే సమయంలో భయపడిపోతున్నారు కూడా. ఈ లీకులు ఇలాగే కొనసాగితే భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పుకొంటున్నారు.

ఫ్యాక్షన్ నేపథ్యంలో ‘అరవింద సమేత’ తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. తాజాగా, లీకైన పిక్ ని చూస్తే అది నిజమేనని తెలుస్తోంది. సినిమాలో నాగబాబు ఎన్టీఆర్ తండ్రి పాత్రలో.. ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తాడని తెలిసింది. ఈ సినిమా రూ. 100కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయడం ఖాయమని చెబుతున్నారు. .ఎన్ టీఆర్ మాంచి ఊపుమీద ఉండటం. దానికితోడు త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో.. అరవింద సమేత పై ఓ రేంజ్ లో అంచనాలున్నాయ్. ఈ చిత్రంలో తారక్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. రాథాకృష్ణ నిర్మాత.