విజయవాడలోనూ.. కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ !

తెలంగాణ మంత్రి కేటీఆర్ క్రేజ్ మాములుగా లేదు. మంగళవారం కేటీఆర్ పుట్టినరోజు. తెలంగాణ, ఆంధ్రప్రదేష్ లోనూ కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరగడం విశేషం. విజయవాడలో కేటీఆర్ అభిమానులు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకొన్నారు. ఈ సందర్భంగా వారంతా గులాబి కండువాలని కప్పుకొని కనిపించారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేటీఆర్ ఆంధ్రా నుంచి పోటీ చేయాలని చాలా మంది అడుగుతుంటారు. ఇటీవల అభిమానులతో లైవ్ చాట్ చేసిన సందర్భంగా కేటీఆర్ కు ఈ ప్రశ్న ఎదురైంది. దీనిపై భవిష్యత్ లో ఏం జరుగుతుందో చెప్పాలేమంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు కేటీఆర్. ఇక, కేటీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపిన వారిలో టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, నాని లు కూడా ఉన్నారు.