సరదాలు పక్కన పెట్టండీ.. బీసీసీఐ ఆదేశం !
టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లాండ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే టీ20, వన్ డే సిరీస్ లు పూర్తి చేశాయి. టీ20 భారత్ నెగ్గగా, వన్ డే సిరీస్ ని ఇంగ్లాండ్ గెలుచుకొంది. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు దొరికిన ఈ ఖాళీ సమయాన్ని భారత క్రికెటర్లు విహార యాత్రగా మలుచుకొన్నారు. కెప్టెన్ కోహ్లీతో మిగితా ఆటగాళ్లు భార్యలతో కలిసి ఇంగ్లాండ్ ని చుట్టేస్తున్నారు. తమ విహారానికి సంబంధించిన ఫొటోలతో కోహ్లి సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాడు. దీనిపై నెటిజర్స్ నుంచి విమర్శలొస్తున్నాయి. మొదట టెస్ట్ సిరీస్ గెలవండీ.. ఆ తర్వాత సరదాలు చేయొచ్చు అని సటైర్స్ వేస్తున్నారు. ఇది బీసీసీఐ కి తలనొప్పిగా మారింది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ మూడు టెస్టులు పూర్తయ్యే వరకు సరదాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు పూర్తయ్యేంత వరకు ఆటగాళ్లతో భార్యలు లేదా ప్రియురాళ్లు ఉండేందుకు అనుమతించబోమని టీమ్‌మేనేజ్‌మెంట్ చెప్పినట్లు సమాచారం. తొలి టెస్టు ఆగస్టు 1న బర్మింగ్‌హామ్‌లో ఆరంభమవుతుంది. భారత క్రికెటర్ల సరదాలకు తాత్కాలికంగా తెరపడనుంది.