వ్యభిచార కేసులో శ్రీరెడ్డి అరెస్ట్ ?

వ్యభిచార కేసులో నటి శ్రీరెడ్డి అరెస్టయ్యింది అన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెబ్ సైట్స్, యూ ట్యూబ్, కొన్ని టీవీ ఛానెల్స్ ఈ వార్తని ప్రసారం చేస్తున్నాయి.క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ ని షేక్ చేసింది శ్రీరెడ్డి. ఇప్పుడు తన ఫోకస్ ని కోలీవుడ్ పైకి షిఫ్ట్ చేసింది. అక్కడి దర్శకులు, హీరోలపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే మురగదాస్, రాఘవ లారెన్స్, శ్రీనాథ్, సుందర్ సి పై షాకింగ్ ఆరోపణలు చేసింది. అక్కడితో ఆగకుండా విశాల్ తనను బెదిరిస్తాడేమోననే అనుమానాన్ని కూడా వ్యక్తంచేసింది.

మరోవైపు, వ్యభిచార కేసులో శ్రీరెడ్డిని అరెస్టు చేయాలనే డిమాండ్ కోలీవుడ్ లో బలపడుతోంది. శ్రీరెడ్డి వైఖరిని వ్యతిరేకిస్తూ సామాజిక వేత్త వారాహి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె డబ్బుల కోసం ప్రముఖులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు.. వ్యభిచారానికి పాల్పడినందుకు ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రముఖ దర్శకుడు భారతీ రాజా కూడా శ్రీరెడ్డిపై విరుచుకుపడ్డారు. శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ జరిగాయని… అయినప్పటికీ, వాటితో ప్రచారం పొందాలని ఆమె అనుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. సినిమావారందరినీ శ్రీరెడ్డి తప్పుపట్టడం సరికాదు.. ఎదుటివారిపై బురదచల్లే కార్యక్రమాన్ని ఇప్పటికైనా ఆపేయాలని సూచించారు.

ఇక, తనని వ్యభిచార కేసులో అరెస్టు చేశారన్న ప్రచారంపై శ్రీరెడ్డి స్పందించారు. తానేమీ వ్యభిచారిని కాదు. డబ్బుకోసం అమ్మాయిని వాడుకుంటున్న మీరే వ్యభిచారం చేస్తున్నట్టు. డబ్బుల కోసం అసత్యాలను సృష్టిస్తున్నారని నిప్పులు చెరిగింది. మీలాంటి మీడియా చీడ పురుగుల కన్నా వ్యభిచారం చేసే అమ్మాయి ఎంతో బెటరని, కొన్ని యూ ట్యూబ్ చానల్స్ కు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసింది. ఇప్పటికైతే.. శ్రీరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. కాకపోతే.. ఆమెని అరెస్ట్ చేసే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి.