పాకిస్థాన్ లో హంగ్

పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కలేదు. మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పీటీఐ 121 స్థానాల్లో ముందంజలో ఉంది. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) 58 స్థానాల్లో ఆధిక్యంతో రెండో స్థానంలో నిలిచింది. మాజీ అధ్యక్షుడు జర్దారీ పార్టీ అయిన పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 50 స్థానాలో ఇతరులు ముందంజలో ఉన్నారు. హంగ్‌ పార్లమెంట్‌ ఏర్పడితే పీపీపీ-కింగ్‌మేకర్‌ పాత్ర పోషించే పరిస్థితి కనిపిస్తోంది. కాగా, పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 272 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

పీటీఐ అధిపతి ఇమ్రాన్‌ఖాన్‌ ఎన్నికల నిబంధనలని ఉల్లంఘించారు. ఆయన ఓటు వేయడం టీవీ ఛానెల్స్ లో ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. దీనిపై ఆయన్ని ఎన్నికల సంఘం ఆయన్ను పిలిపించి వివరణ కోరింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందున ఆయన ఓటును రద్దుచేసే అవకాశం ఉంది. పాకిస్థాన్‌ ఎన్నికల చట్టం ప్రకారం ఓటును రహస్యంగా వేయకపోతే ఆరు నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించవచ్చు.