త‌ల‌చుకుంటే నిమిషంలో…!!

బాలీవుడ్ డ్రీమ్ గాళ్, ప్ర‌స్తుతం బీజేపీ మ‌థుర ఎంపీగా ఉన్న హేమామాలిని చేసిన కామెంట్స్ ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. తాను త‌ల‌చుకుంటే నిమిషంలో సీఎం కాగ‌ల‌నంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారామె. అయితే త‌న‌కు సీఎం ప‌ద‌విపై మోహం లేద‌ని, ముఖ్య‌మంత్రి అయితే ఇత‌ర ఇంట్ర‌స్ట్ ల‌న్నీ కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని అన్నారామె. సినిమారంగంలో స్టార్ డ‌మ్ వ‌వ‌ల్లే తాను ఎంపీ కాగలిగాన‌ని ఆమె అన్నారు. ఎంపీ అవ‌డానికి ముందే బీజేపీ త‌ర‌పున తాను చాలా ప‌నులు చేసేశాన‌ని ఆమె పేర్కొన్నారు.

గత నాలుగేళ్లలో తన నియోజకవర్గంలో చాలా వరకు పనులు పూర్తి చేశానని, బ్రిజ్వాసి ప్రజలతో కలిసి పనిచేయడం తనకు ఎంతో ఇష్టమని ఆమె చెప్పారు. న‌రేంద్ర‌మోదీలాంటి ప్ర‌ధాని మ‌మ‌రెక్క‌డా దొర‌క‌ర‌ని, ఆయ‌న రైతుల కోసం, మ‌హిళ‌ల‌కు, పేద‌ల కోసం ప‌నిచేస్తున్నార‌ని ఆమె అన్నారు.