కొత్త సినిమాపై బన్నీ ట్వీట్
‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ చేయబోయే సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. విక్రమ్ కె కుమార్ చెప్పిన కథని బన్నీ ఓకే చేశాడని తెలిసింది. ఐతే, ఇప్పుడీ ప్రాజెక్ట్ అగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. బన్నీ అంచనాలకు అందుకోవడంలో విక్రమ్ ఫెయిల్ అయ్యాడని చెప్పుకొంటున్నారు. విక్రమ్ రెడీ చేసిన కథలో సెకాంఢాఫ్ పై బన్నీ అసంతృప్తిగా ఉన్నాడట. అందుకే ఈ కథని పక్కన పెట్టేశాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. బన్నీ త్రివిక్రమ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ‘అరవింద సమేత’ తర్వాత బన్నీతో త్రివిక్రమ్ సినిమా ఉండబోతుందని చెప్పుకొంటున్నారు. బన్నీ కోసం పూరి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ ‘దేశముదురు’ కలయికలో హ్యాట్రిక్ చిత్రం రాబోతుందని చెబుతున్నారు.
ఈ ప్రచారంతో మెగా ఫ్యాన్స్ గందరగోళానికి గురవుతున్నారు. ఇది గమనించిన బన్నీ తన తదుపరి సినిమాపై స్పందించారు. ‘నామీద ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. దయచేసి ఇంకొద్ది రోజులు వెయిట్ చేయండి. ఈ సారి మీకు మంచి సినిమా ఇస్తాను. దానికి కొంచం సమయం పడుతుంది. నన్ను అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అంటూ ట్విట్ చేశాడు స్టయిలీష్ స్టార్. బన్నీ ట్విట్ తో ఇన్నాళ్లు జరుగుతున్న ప్రచారం నిజమేనని తేలింది. ఇంకా బన్నీ కొత్త సినిమా ఫైనల్ కాలేదని క్లారిటీ వచ్చింది. ఇక, బన్నీ చెప్పినట్టుగా వెయిట్ చేయక తప్పదు.
My Dearest Fans … Thank you soo much for all the Love . I wanted to tell you all pls be a lil patient about the next movie announcement … bcoz it will take a while more . I want to genuinely deliver a good film . Takes time. Thank you for understanding
— Allu Arjun (@alluarjun) July 26, 2018