‘సైరా’లో నిహారిక.. మాటల్లేవ్.. !
మెగా హీరోయిన్ నిహారిక మెగా హీరోలని మించిపోయింది. వారికి దక్కని అవకాశాన్ని దక్కించుకొంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఏ చిన్ని పాత్రైనా చేయడానికైనా రెడీ అంటూ మెగా హీరోలు పదే పదే చెబుతుంటారు. ఐతే, ఆ అవకాశం అందరికి దక్కలేదు. పవన్ కళ్యాణ్ తర్వాత అల్లుఅర్జున్, రామ్ చరణ్ లు మాత్రమే మెగాస్టార్ సినిమాలో మెరిసారు. మిగితా మెగా యంగ్ హీరోలకు ఆ అవకాశం దక్కలేదు. ఐతే, ఇప్పుడా అవకాశాన్నిమెగా హీరోయిన్ నిహారిక దక్కించుకొంది.`సైరా`లో నిహారిక ఓ పాత్రలో కనిపించబోతోంది.
ఈ విషయాన్ని స్వయంగా నిహారికనే తెలిపింది. ‘సైరా’లో బోయ అమ్మాయిగా కనిపించబోతున్న. అది కూడా రెండు సన్నివేశాల్లోనే. డైలాగ్స్ కూడా ఉండవని చెప్పింది. ఆ అవకాశం ఏలా వచ్చిందని అడిగితే.. “సైరాకి నిర్మాత అయిన మా అన్నయ్య చరణ్ ని పెద్దనాన్న సినిమాలో నటించే అవకాశం గురించి అడుగుతూ ఉన్నా. ఒక్క ఫ్రేమ్ లో కనిపించినా చాలని బతిమాలా. అన్నయ్య మాత్రం ` ఆ విషయం నేనెలా చెబుతాను – దర్శకుడు చెబితే కదా నీకు అవకాశం వస్తుంది` అన్నాడు. అప్పుడే దర్శకుడు సురేందర్ రెడ్డి వచ్చాడు. ఆయనతో నా కోరికని చెప్పా. `మీరు నిజంగా చేస్తారా ?` అని అడిగారు. డైలాగ్స్ లేకపోయినా ఫర్వలేదా? అన్నారు. పర్లేదు చేస్తా అని చెప్పడంతో నాకు క్యారెక్టర్ ఓకే అయ్యింది” అని చెప్పుకొచ్చింది నిహారిక.
ఇక,నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై నీహారిక బోలెడు ఆశలు పెట్టుకుంది. ‘ఒక మనసు’ నిరాశపరిచినా నీహారిక ప్రయత్నం మెప్పు పొందింది. ఐతే, ‘హ్యాపీ వెడ్డింగ్’ తనకు కమర్షియల్ హిట్ ఇస్తుందనే నమ్మకంతో నిహారిక ఉంది. నాగ అశ్విన్ – నిహారిక జంటగా హ్యాపీ వెడ్డింగ్ తెరకెక్కింది.