గూఢచారి ట్రైలర్ టాక్

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూఢచారి’. అడివి శేష్ సరసన శోభిత ధూళిపాళ నటించింది. ఆగస్టు 3న ‘గూఢచారి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. యాక్ష‌న్, రొమాంటిక్ సీన్స్ తో ట్రైలర్ ని కట్ చేశారు. హీరో కుటుంబాన్ని హత్య చేయడంతో అనాధగామారిన అతడు రాలో చేరినట్లు ట్రైలర్ లో చూపారు. ఒక వైపు పరిశోధనలు చేస్తూ మరో వైపు కుటుంబాన్ని చంపిన వారిని వేతికే పాత్రలో అడవి శేష్ నటించినట్లు ట్రైలర్ ద్వారా అర్ధమవుతోంది. టీజర్ మాదిరిగానే ట్రైలర్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉంది.

ఈ స్పై థ్రిల్లర్ ని 116 రోజుల్లో దాదాపు 158 డిఫరెంట్‌ లోకేషన్లలో హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో చిత్రీకరించారు. ఒకప్పటి హీరోయిన్ సుప్రియ యార్లగడ్డ 20 సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ట్రైలర్ లో ఆమె అడివిశేష్ మధ్య సీన్స్ బాగున్నాయి. యాక్షన్ ప్రియులకు గూఢచారి బాగా నచ్చేలా కనిపిస్తొంది. ‘క్షణం’ మాదిరిగానే ‘గూఢచారి’ కోసం అడవిశేష్ కలం పనిచేసింది. ఆయన కథలో సస్పెన్స్ బాగుంటుంది. ‘గూఢచారి’ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండీ.. !