బ్రాండ్ పేరు చెప్పి బాగానే చూపించింది.. !
పెళ్లి తర్వాత హీరోయిన్ గా కొనసాగడమే గొప్ప. అలాంటిది పెళ్లి చేసుకొని.. భర్తతో విడాకులు తీసుకొన్న తర్వాత కూడా బిజీ హీరోయిన్’గా కొనసాగడం మాములు విషయం కాదు. అమలాపాల్ మాత్రం భర్తతో విడిపోయాక మరింతగా రాణిస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇవ్వబోతుంది. అర్జున్ రాంపాల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ బిజీ అయిపోయేందుకు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకొంటుందని చెబుతున్నారు.
బాలీవుడ్ కు వెళ్తున్న ఆనందంలో ఉన్న అమలా పాల్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలిపింది. ‘రేపు తాను ఓ సొంత బ్రాండ్ ను లాంచ్ చేస్తున్నా. ఈ బ్రాండ్ కోసం దాదాపు ఓ ఏడాది నుండి జాగ్రత్తగా వర్క్ చేసుకుంటూ వస్తున్నా’నని తెలిపింది. తాను చెప్పిన మేటరు ఎక్కువ మందికి రీచ్ కావాలనుకుందో ఏమో.. ఓ హాట్ ఫోటోను అప్లోడ్ చేసింది. ఆ క్లీవేజ్ షో చేస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మడు.. బ్రాండ్ పేరు చెప్పి బాగానే చూపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పుడా బ్రాండ్ ఏంటన్నది కూడా రిలీవ్ చేసింది. ‘హిమాలయన్ యోగి’ హెర్బల్ ప్రొడక్ట్ ని అమలా లాంచ్ చేసింది.