‘నాగశౌర్యకు ఇద్దరు’ కావాలట !

భార్యతో వేగడం ఎంత కష్టమో భర్తకు మాత్రమే తెలుసు. అలాంటిది యంగ్ హీరో నాగశౌర్యకు ఇద్దరు భార్యలు కావాలట. ఇద్దరు భార్యల మధ్య నలిగేపోయేందుకు రెడీ అంటున్నారు. ఇల్లాలికి ప్రియురాలికి మధ్య నలిగిపోయే హీరో.. కథలు తెలుగు తెరపై చాలానే వచ్చాయి. అవి ప్రేక్షకులని ఆకట్టుకొన్నాయి కూడా. అప్పట్లో శోభన్ బాబు.. ఇప్పట్లో జగపతి బాబు ఇద్దరితో వేగినవారే. వీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన జగపతి బాబు ‘ఆయనకి ఇద్దరు’ సూపర్ హిట్టయ్యింది.

ఇప్పుడీ సినిమాని రిమేక్ చేయబోతున్నారు. ఇప్పటి ట్రెండుకు తగ్గట్టుగా ‘ఆయనకి ఇద్దరు’ని రెడీ చేయబోతున్నారు. రాజా దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా తెరకెక్కనుంది. యూత్ లో మంచి క్రేజీ సంపాదించుకొన్న నాగశౌర్య ఫ్యామిలీ హీరో అనిపించుకొనే క్రమంలో ఈ కథని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగశౌర్య ‘నర్తనశాల’ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తికాగానే ఇద్దరితో.. మొదలెట్టనున్నాడు.