ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ ఏంటో.. తెలిసిపోయింది.. !

టాలీవుడ్ కు సల్మాన్ ఖాన్ లాంటోడు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పెళ్లి విషయంలో. ‘బాహుబలి’ తర్వాత పె ళ్లి అన్నాడు.. ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రభాస్ ఏమైనా చిన్న పిల్లాడా.. ? అంటూ ఆయన పెదనాన్న సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా అసహనం వ్యక్తం చేసేవరకు వచ్చింది. అభిమానులకు సమాధానం చెప్పలేక కృష్ణం రాజు చూపించిన ప్రస్టేషన్ అది. అక్టోబర్ 23తో ప్రభాస్ వయసు మరో యేడాది కూడా కరిగిపోతుంది. ఎందుకంటే అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు. ఆ రోజైన పెళ్లి ప్రకటన చేస్తాడనే నమ్మకమూ లేదు. ఇప్పటికే ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ రెడీ అయిపోయిందని చెబుతున్నారు. ఆ రోజు అభిమానులకు ‘సాహో’ టీజర్ ని గిఫ్ట్ గా అందించనున్నారు.

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ‘సాహో’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. కేవలం యాక్షన్ సీన్స్ కోసమే రూ. 90కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే పూర్తయిన దుబాయ్ షెడ్యూల్ అదిరిపోయే యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. పలువురు హాలీవుడ్ టెక్నీషన్స్, బాలీవుడు నటీనటులు ‘సాహో’ కోసం పని చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ నటిస్తోంది. ఈ సినిమాని వచ్చే యేడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.