పెళ్లి వార్తని ఖండించిన తమన్నా.. ప్రేమలోనే ఉందట !
కొద్దిరోజులుగా మిల్కీ బ్యూటీ తమన్నాపెళ్లి న్యూస్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తమన్నా పెళ్లి చేసుకోబోతుంది. ఆమెరికాకు చెందిన డాక్టర్ ని పెళ్లాడనుంది. ఆయనకు వ్యాపారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం తమన్నా కుటుంబం పెళ్లి పనుల్లో బిజీగా ఉందని ప్రచారం జరుగుతోంది. తాజాగా, ఈ ప్రచారంపై తమన్నా ట్విట్టర్ వేదికగా స్పందించింది. తనపై పెళ్లిపై వచ్చిన వార్తలన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని కొట్టిపారేసింది. అదే సమయంలో ప్రేమలో ఉన్నానని తెలిపింది. ఎవరితోనని కంగారు పడకండీ.. ! సినిమాలతోనే ప్రేమలో ఉందట.
పెళ్లి వార్తని ఖండించే క్రమంలో.. ప్రెస్ నోటు మాదిరిగా ఓ ట్విట్ చేసింది. “ఒక రోజు యాక్టర్, మరొక రోజు క్రికెటర్, ఇంకొక రోజు డాక్టర్. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని పెళ్లి చేసుకోబోతున్నానంటూ రూమర్లను ప్రచారం చేస్తున్నారు. భర్తను వెతుక్కునే పనిలో నేను చాలా బిజీగా ఉన్నాననే భావనను కలిగింపజేస్తున్నారు. నా జీవితానికి సంబంధించి ఎలాంటి అసత్య ప్రచారాలను నేను అంగీకరించను. ప్రస్తుతానికి సింగిల్ గా నేను చాలా సంతోషంగా ఉన్నా. నా తల్లిదండ్రులు కూడా అల్లుడిని వెతికే పనిలో లేరు. ప్రస్తుతం సినిమాలతోనే నేను ప్రేమలో ఉన్నా. ఒకవైపు నేను సినిమాలతో బిజీగా ఉంటే… ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు. ఇలాంటి తప్పుడు వార్తలు ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగిస్తాయి. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే… ఆ విషయాన్ని అందరితో పంచుకుంటా. ఇందులో దాచి పెట్టాల్సింది ఏమీ లేదు. ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోవడం లేదనే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నా. ఇలాంటి అసత్య ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టండి… ప్లీజ్” అంటూ ట్వీట్ చేసింది తమన్నా.
ఇక, ప్రస్తుతం తమన్నా తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తుంది. తెలుగు క్వీన్ తో పాటు వరుణ్, వెంకీల మల్టీస్టారర్ ‘ఎఫ్ 2’లో నటిస్తోంది. ఇందులో తమ్మూ వెంకీకి జోడిగా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యింది. తమ్మూని క్లీన్ కథానాయికగా పిలుస్తుంటారు. ఆమెకు ఎలాంటి ఎఫైర్స్ లేవు. తమ్మూని ఎవరితోనూ లింకు పెడుతూ వార్తలు రాలేదు. పెళ్లి వార్తలు మాత్రం బాగానే వచ్చాయి.
— Tamannaah Bhatia (@tamannaahspeaks) July 27, 2018