విషాదం : నటి అన్నపూర్ణ కూతురు ఆత్మహత్య

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకొంది. టాలీవుడ్‌ సీనియర్‌ నటి అన్నపూర్ణ కూతురు కీర్తి ఆత్మహత్య చేసుకొంది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయింది. ఈ ఘటనపై జూబ్లీ హీల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనారోగ్య సమస్యలే కీర్తి ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఐతే, దర్యాప్తు అసలు నిజాలు బయటపడుతాయని చెబుతున్నారు.

కీర్తి అన్నపూర్ణ దత్త పుత్రీక. ఆమెకు పిల్లలు లేకపోవడంతో కీర్తిని దత్తత తీసుకుంది. 3 ఏళ్ళ క్రితం వెంకట కృష్ణ అనే వ్యక్తితో కీర్తికి వివాహం అయ్యింది. ప్రస్తుతం ఆయన రాయచూర్ లోని ఎఫ్ సీఐ క్లర్క్ గా పని చేస్తున్నాడు. దీంతో కీర్తి త‌న ఏడాది కొడుకుతో బంజారా హిల్స్ లోని త‌ల్లి ఇంటిలోనే ఉంటున్న‌ది. ఈ రోజు తెల్లవారు జామున కీర్తి ఉన్న బెడ్ రూమ్ డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి డోర్ పగలగొట్టి చూడగా, కీర్తి ఉరివేసుకొని కనిపించిందని అని అన్నపూర్ణ తెలిపారు. కూతురు మరణంపై అన్నపూర్ణ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి.

అన్నపూర్ణ ఏడువందలకు పైగా సినిమాల్లో నటించింది. ఇప్పుడొస్తున్న సినిమాలోనూ కీలక పాత్రల్లో కనిపిస్తోంది. నాన్నమ్మ, తాతమ్మ పాత్రలని చేస్తోంది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’లోనూ ఆమె కీలక పాత్రలో నటించారు.