రేవంత్ పై పోరుకు టీఆర్ఎస్ ప్లాన్..!!
వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడంతో పాటు విపక్ష కాంగ్రెస్ ను వీక్ చేయడానికి టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ లో ప్రధాన నేతలను ఓడించడమే టార్గెట్ గా పెట్టుకుంది అధికార పార్టీ. ఇందుకోసం రాజకీయంగా తన వ్యూహానికి పదును పెట్టింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు ధీటైన అభ్యర్థి కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొండగల్ లో రాజకీయ పోరుకు టీఆర్ఎస్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.
రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ను ఎలాగైనా చేజిక్కించుకోవాలనే లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఈ విషయంపై ఇప్పటికే టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు సమాలోచనలు జరిపారు. రేవంత్‌పై బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని టీఆర్ఎస్ ముఖ్య నేతలు నిర్ణయించుకున్నారట. ఇందుకోసం ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. వారిద్దరినీ పిలిచి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ లో టఫ్ ఫైట్ ఇచ్చేలా టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. నరేందర్ రెడ్డి, గురునాథ్ రెడ్డి ల్లో ఎవరో ఒకరిని బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తోంది. రేవంత్ ను ఢీకొట్టాలంటే అంగబలం, అర్థబలం ఉన్న ధీటైన నాయకుడినే బరిలో దింపితే ఎన్నికల సమయంలో రేవంత్ బయటకు వెళ్ళి ప్రచారం చేసే పరిస్థితి లేకుండా చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తిచేసి, ఇక టీమ్ వర్క్ తో ముందుకెళ్లాలని భావిస్తోందట గులాబీ పార్టీ. మరి అధికార పార్టీ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి..