రష్యా ఓపెన్‌ టైటిల్ విజేత సౌరభ్

రష్యా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ వరల్డ్ సూపర్-100 టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుడు, మాజీ ఛాంపియన్ సౌరభ్ వర్మ సంచలనం సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో జపాన్ షట్లర్ కోకి వటనబైతో పోటీపడి సౌరభ్ అద్భుత విజయం సాధించాడు. స్వర్ణపతకాన్ని సొంతం చేసుకున్నాడు. తొలి సెట్‌లో 18-21తో ఓటమిపాలైన సౌరభ్ ఆ తర్వాత పుంజుకొని 21-12, 21-17 తేడాతో రెండు సెట్లు కైవసం చేసుకొని విజయాన్ని నమోదు చేశాడు.