తల్లి కాబోతున్న ప్రియమణి..!?
ఎన్నో సినిమాల్లో నటించి స్టార్డం తెచ్చుకున్న ప్రియమణి గత ఏడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. మగాళ్లు వట్టి మాయగాళ్లే అంటూ కుర్రకారును ఓ దశలో ఉర్రూతలూగించింది ఈ స్టార్ హీరోయిన్. ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రియమణి పెళ్లి తరువాత సినిమాలకు దూరమయ్యింది. ఈ మధ్య టీవీ ఛానెల్ లో డాన్స్ ప్రోగ్రాం కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది ఈ హీరోయిన్. అయితే ప్రస్తుతం ప్రియమణి తల్లి కాబోతోందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఈ ప్రచారంపై ప్రియమణి స్పందించలేదు. అసలు ఈ వార్తలో వాస్తవమెంత అనేది అధికారికంగా తెలిస్తే తప్ప నమ్మలేం మరి.