గీత గోవిందం.. బన్నీ రివ్యూ !

‘గీత గోవిందం’ రివ్యూ వచ్చేసింది. ఆగస్టు 15న ‘గీత గోవిందం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పుడే రివ్యూ ఏంటీ ? అనుకొంటున్నారు.. ! ఈ సినిమాని ఇప్పటికే స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ చూసేశారు. ఆదివారం జరిగిన ఈ చిత్ర ఆడియో వేడుకలో చిన్నపాటి రివ్యూ కూడా ఇచ్చేశారు. ‘ఆల్రెడీ సినిమా చూశాను. చాలా బాగుంది. విజయ్, రష్మిక చాలా బాగా చేశారు.వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ రష్మికది. ఈ పాత్ర ఆమెకు రాసి పెట్టి ఉంది’ అన్నారు బన్నీ.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు ఆకట్టుకొంటున్నాయి. ఇప్పుడు బన్నీ అందించిన రివ్యూతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగేలా ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్.. ‘ఛలో’ సూపర్ హిట్ తర్వాత రష్మిక మందన చేసిన చిత్రమిది. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ నుంచి వస్తున్నఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ రిలీజ్ కి ముందే హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. బన్నీ వాసు నిర్మాత.