వారాహిపై కేసు పెట్టిన శ్రీరెడ్డి
అర్థనగ్న నిరసన ప్రదర్శనతో మీడియా దృష్టిని తనవైపుకు తిప్పుకున్న శ్రీరెడ్డి, అలా వచ్చిన పాపులారిటీ తగ్గకుండా వుండేందుకోసం నానా తంటాలూ పడ్తోంది. ఇందులో బాగంగా ఇప్పుడు తమిళ్ లీక్స్ మొదలుపెట్టింది. గత కొన్ని రోజులుగా కోలీవుడ్ ప్రముఖులపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమెపై కేసు కూడా నమోదైంది. వారాహి అనే దర్శక నిర్మాత శ్రీరెడ్డి వేశ్య. ఆమె అన్ని తెలిసే చేసింది. వ్యభిచార కేసులో ఆమెని అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే వారాహిపై తీవ్రంగా స్పందించి శ్రీరెడ్డి.. ఇప్పుడు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘దర్శక – నిర్మాత వారాహి.. మీడియాలో సమావేశంలో వ్యభిచారిగా చిత్రీకరిస్తూ నా గురించి తప్పుగా మాట్లాడారు. అంతే కాక నాకు ఫోన్ చేసి బెదిరించారు. ఇది నన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. వారాహిపై లైంగిక వేధింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అంటూ చెన్నై పోలీసు కమిషనరేట్ లో శ్రీరెడ్డి ఫిర్యాదు చేసింది.