జగన్ సెల్ఫ్ గోల్.. !?

ప్రత్యేక హోదాపై ఓ రేంజ్ లో పోరు నడుస్తున్న సందర్భంలో రాజకీయ పార్టీలు క్రెడిట్ కోసం తమ వ్యూహాలకు పెడుతున్న విషయం తెలిసిందే. ఎత్తుకు పైఎత్తు వేస్తూ అధికార పార్టీపై విరుచుకు పడాల్సిన సందర్భం ఇది. ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోసం వైసీపీ చేయని ప్రయత్నం లేదు. ఈ సందర్భంలో పార్టీ అధినేతగాలు మాట్లాడే ప్రతి మాటా ఎంతో విలువైనది, ఎంతో ప్రభావితం చేసేదిగా ఉంటాయి. అందులోనూ ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ తరుణంలో ఒక్కసారి మాటజారిన తిరిగి సరిదిద్దుకునే సమయం కూడా లేదు. కానీ విపక్ష నేత జగన్ తీరుతో ఆ పార్టీ ఇప్పుడు సెల్ఫ్ గోల్ లో పడిందనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే జగన్ బీజీపీతో అంటగాకుతున్నారం టూ అధికార టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించకపోవడం, విమర్శించకపోవడం ఏపీ ప్రజల్లో కూంత అయోమయ పరిస్థితిలో పడేసింది. వైసీపీకి ఇప్పుడిప్పుడే కాస్త అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో జగన్ వైఖరి ఆ పార్టీకి నష్టాన్ని చేకూర్చేలా కనిపిస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ కు నలుగురు పెళ్ళాలంటూ వ్యక్తిగత విమర్శలకు దిగి పవన్ తో కోరి విభేదాలు తెచుకున్నాడనే వాదన వినిపిస్తోంది. అధికార పార్టీకి దూరంగా ఉన్న వారిని దోస్తీ చేసుకుని పోరాడాల్సింది పొయి ఇలా చేయడమేంటనీ విశ్లేకులు విస్తు పోయారు కూడా.

పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేసి కోరి వివాడాం తెచ్చుకోవడం ఒకెత్తయితే , 2014 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు రాజకీయంగా కీలక సమస్యగా మారిన కాపు రిజర్వేషన్ల అంశంపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీ పై కాపులు వ్యతిరేకత ప్రదర్శించేలా చేసింది. రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం పరిధిలో ఉందని జగన్ చెప్పిన అది సాధ్యం కాదనే ధోరణిలో అయన మాట్లాడటమీ కాపుల్లో వ్యతిరేఖత పెంచిందనేది నిజం. రాజకీయాల్లో ప్రతీ మాట ప్రభావితం చేస్తుందనేది ఈ మాటలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వేలుహున్న జగన్ తన వైఖరితో సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారన్నది వాస్తవమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా ఆచితూచి అడుగువేస్తూ అసలైన రాజకీయ నాయకుడిగా వ్యవహరించకపోతే పాదయాత్ర ప్రతిఫలం కూడా ల్లేకుండాపోయే ప్రమాదమూ లేకపోలేదు.