హృతిక్.. బ్రేకప్’ని బ్రేక్ చేస్తాడట.. !
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషల్ సంచలన నిర్ణయం తీసుకొన్నాడు. ఆయన మళ్లీ పెళ్లి చేసుకొనేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తో హృతిక్ రోషన్ ఏపీ సోడ్.. రచ్చ రచ్చ అయిన సంగతి తెలిసిందే. కంగనా పంపిన ప్రేమలేఖలు, ఈమెయిల్స్ వ్యవహారం రచ్చకెక్కింది. అది హృతిక్ సంసార జీవితంలో నిప్పులు పోసింది. ఈ కారణంగా హృతిక్ భార్య సుషాన్నే ఖాన్ విడాకులు తీసుకొందనే ప్రచారం జరిగింది. ఐతే, విడాకుల తర్వాత కూడా హృతిక్-సుషాన్నే పిల్లల కోసం అప్పుడప్పు కలుస్తున్నారు.
ఐతే, ఈ కలయికలు ఈ మధ్య మరీ ఎక్కువయ్యాట. వీరి బ్రేకప్ కు బ్రేక్ పడింది. హృతిక్, సుషాన్నే ఖాన్ మళ్లీ ఒక్కటవ్వబోతున్నారు. మళ్లీ పెళ్లి చేసుకోబుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. సుషానేతో విడిపోయిన తర్వాత కూడాఅ హృతిక్ కు పిల్లలు, సినిమాలే ప్రపంచంగా జీవనం సాగిస్తున్నారు. బహుశా.. అది నచ్చే సుషానే మళ్లీ హృతిక్ కి దగ్గరైనట్టు తెలుస్తోంది. వీరికి 2000లో వివాహం జరిగింది. 2014 లో విడియారు. ఇప్పుడు 2018లో మళ్లీ తిరిగి ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక, హృతిక్-కంగనా ఏపీసోడ్ బాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు హాట్ టాపిక్ గా నడిచిన సంగతి తెలిసిందే. కంగనా పంపిన ప్రేమలేఖలు, ఈమెయిల్స్ వ్యవహారం రచ్చకెక్కింది. వీరి గొడవకు కోర్టు కూడా చేతులెత్తేసింది. చివరకు హృతిక్, రకుల్ ఎవ్వరికి వారు తగ్గి.. ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. ఈ క్రమంలో హృతికి మాజీ భార్యనే మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు. మరీ.. కంగనా పెళ్లెప్పుడు ? అనేది ఆసక్తిగా మారింది. హృతిక్ ఏపీసోడ్ ముగిసిన వెంటనే.. తాను మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నానని చెప్పేసింది కంగనా.