బంగారు బోనం కాదు.. భక్తుల సంతోషం కావాలి..!!
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
పుట్టెడు దుఃఖంతో భక్తులు తన దగ్గరికి వస్తున్నారని, తన బిడ్డలు , ఆడపడుచులు చాల కష్టాలు పడుతున్నారని భవిష్యవాణిలో స్వర్ణలత చెప్పారు. బంగారు బోనంతో ఆనందపరచాలనుకోవడం మూర్కత్వమేనని ఆగ్రహించారు. ఈ సంవత్సరం అంత ఆనంద పరిచే విధంగా ఏమీలేదని, భక్తులకు మీరు మంచి చేస్తున్నారని అనుకుంటున్నారు. కానీ, కీడు ఎక్కువ చేస్తున్నారని చెప్పారు. నా బిడ్డలను నేనే రక్షిస్తా, అలాగే దుష్టులని శిక్షిస్తానంటూ భవిష్యవాణిలో ఆమె చెప్పారు.
ఈ సారి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని చెప్పారు. కుల మత బేధం లేకుండా తన దగ్గరికి వచ్చే భక్తులను సమానంగా ఆశీర్వదిస్తానాని, తప్పు చేసిన వారిని కచ్చితంగా శిక్షిస్తానాని అమ్మవారి వాక్కు వినిపించారు.