సాహో’ దర్శకుడితో బన్నీ సినిమా ?

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకే చేసిన విక్రమ్ కె కుమార్ కథని బన్నీ పక్కకు పెట్టినట్టు సమాచారమ్. అది ఆయన్న పూర్తిగా సంతృప్తి పరచకపోవడమే కారణమని చెబుతున్నారు. దీంతో బన్నీ కోసం కొత్త కథని రెడీ చేసే పనిలో విక్రమ్ కుమార్ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ‘కొద్దిరోజులు ఓపిక పట్టండి. తప్పదు’ అంటూ ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేశాడు బన్నీ. ఐతే, విక్రమ్ కుమార్ కథ కోసమే వెయిట్ చేయకుండా.. బన్నీ బయటి కథలు కూడా వింటున్నారంట.

ప్రభాస్ ‘సాహో’ సినిమాకు పనిచేస్తున్న సహాయ దర్శకుడు ఇటీవలే బన్నీకి ఓ లైన్ ని వినిపించాడట. అది బన్నీకి విపరీతంగా నచ్చేసిందట. ఐతే, ఫైనల్ స్క్రిప్ట్ సంతృప్తికరంగా రాకపోవడంతో దాన్ని కూడా పక్కన పెట్టేసినట్టు సమాచారమ్. ఆ కథ ఓకే అయ్యుంటే గీతా, యువి సంస్థలు బన్నీ సినిమాని నిర్మించేవి. ఆదివారం జరిగిన ‘గీత గోవిందం’ ఆడియో ఫంక్షన్ లోనూ తన కొత్త సినిమాపై బన్నీ క్లారిటీ ఇవ్వలేకపోయాడు. ఇంకా సెట్ అవ్వలేదు. వెయిట్ చేయాల్సిందేనని చెప్పారు.

ఓ మాస్ కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని బన్నీ ఆశపడుతున్నాడు. అందుకే విక్రమ్ కుమార్ రెడీ చేస్తున్నకథకి మసాల అందమని చెప్పాడట. మాస్, యాక్షన్ బన్నీకి కొట్టిన పిండి. రేసుగుర్రం, సరైనోడు లాంటి మాస్ మసాల సినిమాలతో హిట్స్ అందుకొన్నారు. మరోసారి అలాంటి స్పైసీ కథ కావాలని బన్నీ అడుగుతున్నాడట. మరీ.. చివరికి బన్నీ ఎలాంటి కథని ఓకే చేస్తారన్నది చూడాలి.