కాంగ్రెస్’లో ముందుగానే అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌..!!

ముమ్మాటికీ కేసీఆర్ మోడీ ఏజెంట్ అని, టీఆరెస్ కు ఓటేస్తే మోడీకి వేసినట్లేన‌ని టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు నిర్ణయించేది రాహుల్ గాంధీనే అని ఆయ‌న అన్నారు. త‌న‌కు వ్యక్తి గత అభిప్రాయం లేదని, అధిష్టాన మాటనే త‌న‌ మాట అని చెప్పారు ఉత్త‌మ్. సెటిలర్స్ లో కాంగ్రెస్ పై వ్యతిరేకత తగ్గిందని, పార్టీటికెట్ ల లో సెటిలర్స్ కు తప్పక ప్రాధాన్యత ఉంటుందన్నారు. హైద‌రాబాద్ లో ఉన్న సీమాంధ్రులు, మైనార్టీలు కాంగ్రెస్ ప‌క్షాన ఉంటార‌ని, పొత్తులు లేకున్నా కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు.

గతం కంటే రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా చాలా బలంగా ఉందని, కాంగ్రెస్ ఎన్నికలకు రెడీగా ఉందని ఉత్త‌మ్ అన్నారు. సామాజిక సమతుల్యత ,గెలుపు, సర్వే లు అన్ని అభ్యర్థి ఎంపికలో కీలకమవుతాయన్నారాయ‌న‌. అభ్యర్థులను ఎన్నికలకు ముందుగానే ప్రకటిస్తామ‌ని, రాహుల్ కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారన్నారు. టీఆర్ఎస్ నేత‌లు చాలామంది త‌న‌తో ట‌చ్ లో ఉన్నార‌ని, త్వ‌ర‌లోనే వారిని కాంగ్రెస్ లో చేర్చుకుంటామ‌న్నారు ఉత్త‌మ్. కాంగ్రెస్ లో టికెట్ కోసం పోటీ ప‌డుతున్నారంటేనే కాంగ్రెస్ గెలుస్తుంద‌ని అర్థ‌మ‌న్నారు.