హరీష్’కు రేవంత్ సవాల్..!!
టిఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లను అడ్డుపెట్టుకుని నిధులను దోచుకుంటుందని, ఆయకట్టు పెరగకుండానే, నిర్మాణ వ్యయం పెరిగడమేంటని కాంగ్రెస్ నేత రేవంత్ అన్నారు. ప్రాజెక్టులపై జేఏసి రౌండ్ టేబుల్ సమావేశం పెడితే మామ, అల్లుళ్లు ఉలిక్కి పడుతున్నారని ఆయన అన్నారు. జేఏసి ఇచ్చిన సలహాలు తీసుకోకుండా హరీష్ రావు ఎదురుదాడికి దిగుతున్నారని, విషం చిమ్మే ప్రయత్నం చేశారని ఆరోపించారు రేవంత్.
హరీష్ రావు అన్ని అబద్దాలే మాట్లాడారని, వివిధ సందర్భాల్లో హరీష్ రావు మాట్లాడిన వీడియో ను మీడియాకు విడుదల చేశారు రేవంత్. కాళేశ్వరం పూర్తి అయితే మొదట నీరు ఎవరికి వస్తాయో హరీష్ రావు చెప్పాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ కు ప్రాజెక్టులు కట్టే ఆలోచనే లేదంటూ హరీష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పాలమూరు పాత ప్రాజెక్టు అని కృష్ణా బోర్డ్ దగ్గర మీరు అఫిడవిట్ ఇచ్చింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు.
నాగార్జున సాగర్, శ్రీశైలం, భీమా, కోయల్ సాగర్, నెట్టెం పాడు, పాలమూరు రంగా రెడ్డి కాంగ్రెస్ ప్రారంభించినవేనని,
కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల పై చర్చకు సిద్దమని ఆయన అన్నారు. మామ పది శాతం, అల్లుడు రెండు శాతం కమిషన్ కొట్టేందుకే ప్రాజెక్టులని ఆయన ఎద్దేవా చేశారు. తుమ్మిడి హట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించాలని 2015 లోఇంజినీర్స్ నివేదిక ఇచ్చారని, మెడిగడ్డ వద్ద నిర్మించవద్దని స్పష్టంగా చెప్పారన్నారు. నివేదికకు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మించడంలో మతలబు ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టుల పై ప్రెస్ క్లబ్, లేదా అమరుల స్థూపం దగ్గర ఎక్కడైనా చర్చకు తాను సిద్దమని సవాల్ విసిరాఉ. హరీష్ బహిరంగ చర్చకు రావాలని తాము చెప్పింది తప్పయితే ముక్కు నేలకు రాస్తామన్నారు రేవంత్.