చిరు గ్రీన్ సవాల్ స్వీకరించిన ప‌వ‌న్!

తెలంగాణ ప్ర‌భుత్వం హ‌రిత‌హారంలో భాగంగా సెల‌బ్రిటీల‌కు గ్రీన్ ఛాలెంజ్ విసురుతున్న సంగ‌తి తెలిసింది. కేటీఆర్, హీరో మ‌హేష్, ఎన్టీఆర్, రాజ‌మౌళి, క‌విత ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గ్రీన్ ఛాలెంజ్ లిస్టులో చాలామందే ఉన్నారు. తాజాగా మెగా బ్ర‌ద‌ర్స్ చిరు, ప‌వ‌న్ కూడా గ్రీన్ ఛాలెంజ్ లిస్టులో ఉన్నారు. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా అన్న‌య్య చిరంజీవి విసిరిన గ్రీన్ స‌వాల్ ను జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వీక‌రించారు. మంగ‌ళ‌వారం సాయంత్రం హైద‌రాబాద్, మాదాపూర్ లోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మూడు మొక్క‌ను నాటారు. దీంతో అన్న‌య్య గ్రీన్ ఛాలెంజ్ ను స్వీక‌రించిన త‌మ్ముడంటూ మెగా అభిమానులు తెగ సంబ‌రప‌డిపోతున్నారు.