క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన మెగా డాటర్..!!
గత కొంత కాలంగా క్యాస్టింగ్ కౌచ్ అంశం సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తున్నసంగతి తెలిసిందే. శ్రీరెడ్డి ఇష్యూతో ఈ అంశంపై పెద్ద ఫోకస్ అయింది. దీనిపై ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు కూడా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కూడా శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొందరైతే క్యాస్టింగ్ కౌచ్ ను తాము ఎదుర్కొన్నామని బహిరంగంగానే వెల్లడించారు , ఇంకొందరు అలాంటివేం లేవని చెప్పారు కూడా. అయితే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా చేస్తున్న మెగాడాటర్ నిహారిక ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించింది.
సినీ ఇండస్ట్రీ ఒక్కదానిలోనే క్యాస్టింగ్ కౌచ్ ఉందపి చెప్పడమైతే చాలా తప్పని, తాను చాలా స్టోరీస్ చూశాను, విన్నానని నిహారిక చెప్పారు. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలా జరుగుతుందని, కానీ అమ్మాయిలు తల ఊపకుంటే ఏదీ జరగదని, వారి ప్రమేయం లేకుండా ఎవరైనా ఏదైనా చేశారంటే అది సెక్సువల్ అసాల్ట్ అని ఆమె అన్నారు. అది అయిపోయాక వచ్చి వాళ్లు చేశారు.. వీళ్లు చేశారు అని చెబితే తప్పు అవుతుందన్నారు నిహారిక. మీరు ఎస్ అనకుండా ఏమీ జరగదు. నిజంగానే నాకు ఇది తప్ప వేరే దారే లేదు అనుకుంటే అప్పుడు నువ్వది చెయ్యాలి అంటూ చెప్పుకొచ్చారు.
తాను ఫ్రాంక్‌గా వాళ్ల సిచ్యుయేషన్‌లో ఉండి మాట్లాడనని, ఎందుకంటే తన బ్యాక్ గ్రౌండే డిఫరెంటని నిహారిక చెప్పారు. తాను బయటి నుంచి వచ్చిన అమ్మాయిలా మాట్లాడలేనని, తాను మాట్లాడినా కూడా అది తప్పు అవుతుందని తెలిపింది నిహారిక.