ఎన్టీఆర్’కు 100కోట్లు కావాలట !

ఎన్టీఆర్ కు రూ. వంద కోట్లు కావాలట. అంతకుమించి తగ్గేదే లేదు అంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఆయన భార్య బసరవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనున్నారు. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ జీవిత కథ ఎన్నో విశేషాలతో ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇటీవలే ‘ఎన్టీఆర్’ తొలి షెడ్యూల్ ని పూర్తి చేసుకొన్నాడు. అప్పుడే ‘ఎన్టీఆర్’ కొనేసేందుకు పోటీ పడుతున్నారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. ప్రముఖ సంస్థ సోని పిక్చర్స్ ‘ఎన్టీఆర్’ తెలుగు రైట్స్ కోసం రూ. 80కోట్ల ఆఫర్ చేసినట్టు తెలిసింది. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ కూడా ‘ఎన్టీఆర్’ రైట్స్ ని దక్కించుకొనేందుకు రంగంలోకి దిగింది. ఏకంగా రూ. 85 కోట్లను ఆఫర్ చేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారమ్. ఐతే, చిత్రబృందం మాత్రం రూ. 100కోట్లు డిమాండ్ చేస్తుందని చెబుతున్నారు.

అన్నగారి సినిమా స్టార్స్ తో నిండిపోయింది. హెచ్.ఎం. రెడ్డిగా కైకాల, నాగిరెడ్డి పాత్రకి గాను ప్రకాశ్ రాజ్, బీఏ సుబ్బారావు పాత్రకి గాను సీనియర్ నరేష్ ను ను ఎంపిక చేశారు. ఇదీగాక, ఈ చిత్రంలో మహేష్ బాబు, నాగచైతన్య, రానా దగ్గుపాటి, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్.. తదితరులు కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ఎన్ టీఆర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.