రోబో ‘2.O’ టీజర్ రిలీజ్ డేటు ఫిక్స్

శంకర్ దర్శకత్వంలో రోబో ‘2.O’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దాదాపు రూ. 400కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించబోతున్నారు. ఎమీ జాక్సన్ హీరోయిన్. నవంబర్ 29న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇన్నాళ్లు ఈ సినిమా ఎప్పుడొస్తుందో అనే డౌటు ఉండేది. దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చేసింది. నవంబర్ 29న సినిమాని కచ్చితంగా విడుదల చేస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్ దృష్టి సారించనుంచి చిత్రబృందం. ఇందులో భాగంగా టీజర్ విడుదలకు ప్లాన్ చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ‘2.ఓ’ టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.

అదే రోజున బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ‘గోల్డ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా థియేటర్స్ లో రోబో ‘2.ఓ’ టీజర్ ని ప్రదర్శించనున్నారు. దీంతో విడుదలకు ముందే ‘2.ఓ’ గోల్డ్ అనిపించుకోనుందని చెప్పుకొంటున్నారు.