గోపీచంద్ కొత్తదనం చూపిస్తాడట !

రొటీన్ రోత నుంచి బయటపడాలంటే సాహసం చేయాల్సిందే. ఇప్పుడా సాహసం చేయడానికి రెడీ అయ్యాడు యాక్షన్ హీరో గోపీచంద్. సాహసం చేయడం గోపీకి కొత్తేమీ కాదు. ఇది వరకు చేశాడు. ఈ యాక్షన్ హీరో ఫ్యామిలీ హీరో అనిపించుకోవాలని ఆరాటపడ్డాడు. అందులో కొద్ది మేరకు సక్సెస్ అయ్యాడు కూడా. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కూడా గోపీకి సరైన హిట్ ఇవ్వడం లేదు. దీంతో మరోసారి సాహసం చేసేందుకు గోపీ రెడీ అయినట్టు సమాచారమ్.

ఈ సారి ప్రేక్షకులని థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కొత్త దర్శకుడు కుమార్ చెప్పిన కథని గోపీ ఓకే చేశాడు. ఇదో థ్రిల్లర్ సినిమా అని తెలిసింది. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. గోపీకి జంటగా కాజల్ నటించనుంది. గోపీతో జతకట్టడం కాజల్ కి ఇదే తొలిసారి. ఈ యేడాది చివరల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారమ్. మరీ.. థ్రిల్లర్ సినిమా గోపీకి హిట్ అందిస్తుందేమో చూడాలి.