యాదాద్రిలో వ‌రుణ యాగం

స‌రైన స‌మ‌యంలో వ‌ర్షాలు కుర‌వ‌క రైత‌న్న‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాల‌నే న‌మ్ముకుని వ‌ర్షాధార పంట‌ల‌ను వేసిన రైతులు, ఇప్పుడు వ‌ర్షాలు లేక పంట‌లు ఎండిపోతున్న ప‌రిస్థితిని చూసి క‌ష్టాల‌పాల‌వుతున్నారు. వ‌ర్షాలు కురిసి రాష్ట్రం పాడి పంట‌ల‌తో సుభిక్షంగా ఉండాల‌ని కాంక్షిస్తూ యాదాద్రిలో వ‌రుణ యాగం నిర్వ‌హిస్తున్నారు.

గురువారం నుంచి ఈ నెల 6వ‌ర‌కు దాదాపు ఐదు రోజుల పాటు యాదాద్రి శ్రీ లక్ష్మీ న‌ర‌సింహ స్వామివారి దేవ‌స్థానంలో వ‌రుణ యాగం నిర్వ‌హిస్తున్నారు. యాదాద్రి కొండ‌పై నిర్వ‌హించే ఈ యాగానికి భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో హాజ‌రై యాగాన్ని వీక్షిస్తున్నారు.