తెలంగాణ పోలీసుల ఫేషియల్ రికగ్నైజ్ సిస్టం యాప్..!
నేరస్తులను గుర్తించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. నేరస్తులందరిని ఫేషియల్ రికాగ్నిషన్ టెక్నాలజీకి అనుసంధం చేయనున్నట్లు తెలంగాణ పోలీస్ బాస్ వెల్లడించారు. నేరం జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరా లో లంభించిన ఫుటేజ్ ను ఫేషియల్ రికాగ్నిషన్ టెక్నాలజీ తో పోల్చి నిందితులను పట్టుకొనున్నారు పోలీసులు. ఇందుకోసం దేశంలో నే మొట్టమొదటి సారిగా తెలంగాణ పోలీస్ శాఖ ఫెషియల్ రేకగ్నైజ్ సిస్టమ్ యాప్ ను డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు.
టీఎస్ కాప్ యాప్ కు ఫెషియల్ రేకగ్నైజ్ సిస్టమ్ అనుసంధానం చేసి నేరాలను అదుపు చెయడానికి ఈ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుందని డీజీపీ తెలిపారు. ఈ సిస్టమ్ ద్వారా క్రిమినల్ కేసులను,మిస్సింగ్ కేసులను, గుర్తు తెలియని డెడ్ బాడీస్ లను తెలుసుకోవడంతో పాటు లక్ష ఫొటోలను ఈ సిస్టమ్ లో పొందుపరచడం జరుగుతోందని ఆయన తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టగేషన్ అధికారులందరికి శిక్షణ ఇచ్చి ఈ సిస్టమ్ ను వాడుకలోకి తీసుకోస్తామన్నారు.
తెలంగాణ లో నేరాలు చేస్తే దొరికి పోతాం అనే విధంగా తెలంగాణ పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ ని తీసుకు వస్తున్నమన్నారు.
తెలంగాణ రాష్ట్రం లో ఉన్న నేరగాళ్ల వివరాలతో కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న నేరస్తుల వివరాలు మొత్తం ఈ సిస్టమ్ లో పొందుపరుస్తామని, నేరాలు చేసి లొంగిపోయిన వారూ సత్ప్రవర్తన కలిగిన వారి ఫోటోలను ఈ సిస్టమ్ నుండి తీసివేయడం జరుగుతుందని డీజీపీ తెలిపారు. మావోయిస్టుల కు సంబంధించిన ఫోటోలను కూడా ఫెషియల్ రేకగ్నైజ్ సిస్టమ్ లో పొందుపరుస్తామన్నారు. పాత నేరస్తుల వివరాలను,వారి ఫింగర్ ప్రింట్స్ వివరాలను డాటా బేస్ ద్వారా ఈ సిస్టమ్ లో పొందుపరచనున్నట్లు డీజీపీ చెప్పారు.