బెల్లంకొండ ఇమేజ్ ఇక్కడ పనికొచ్చింది !


యంగ్ హీరో బెల్లకొండ శ్రీనివాస్ మాస్ ఇమేజ్ ఇప్పుడు అక్కరకొచ్చింది. ఆయన తాజా చిత్రం ‘సాక్ష్యం’ మాస్ ప్రేక్షకులని అలరిస్తోంది. దీంతో కాసుల వర్షం కురుస్తోంది. కేవలం 4 రోజుల్లోనే రూ. 40కోట్లు కలెక్ట్ చేసింది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఇంకా అలాగే ఉన్నాయి. వీటికి రూ. 12కోట్ల వరకు రావొచ్చని చెబుతున్నారు. ఫైనల్ గా ‘సాక్ష్యం’ సేఫ్. బెల్లకొండ ఖాతాలో హిట్ పడిపోయింది.

‘అల్లుడు శ్రీను’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లకొండ. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా.. బెల్లకొండలో మాస్ హీరో కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయని తెలిసివచ్చింది. ఆ తర్వాత చేసిన ‘స్వీడున్నోడు’లోనూ డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ లో ఇరగదీశాడు. ఐతే, ‘స్వీడున్నోడు’ కలెక్షన్స్ లో ఆ స్వీడు కనిపించలేదు. ప్లాపుగా మిగిలిపోయాడు. ఇక, బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘జయ జనాకి నాయక’లో అదరగొట్టేశాడు బెల్లకొండ. ఈ సినిమాతో తొలిసారి హిట్ కిక్కు రుచి చూశాడు.

ఈ మూడు సినిమాల ద్వారా బెల్లకొండ మాస్ ఇమేజ్ ని పొందాడు. ఇప్పుడా మాస్ ఇమేజ్ ‘సాక్ష్యం’ ఉపయోగపడింది. ఈ సినిమా యూత్, ఫ్యామిలీ, మాస్ ప్రేక్షకులని అలరిస్తోంది. ముఖ్యంగా బి, సీ సెంటర్స్ లో ‘సాక్ష్యం’ మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో బెల్లకొండ ఇన్నాళ్ల శ్రమ అక్కరకొచ్చిందని ఇండస్ట్రీలో చెప్పుకొంటున్నారు. బెల్లకొండ రూపంలో మనకో మాంచి మాస్ హీరో దొరికినట్టే.. !