సునీల్.. హీరోగా ఎంత? కమెడియన్ గా ఎంత ??
సునీల్ కమెడియన్ గా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. హీరోగా వరుస ప్లాపులు పలకరిస్తుండటంతో.. ఈ నిర్ణయం తీసుకొన్నాడు. ఇకపై సునీల్ హీరో, కమెడియన్ రెండు రకాల పాత్రల్లో కనిపించనున్నాడు. అంటే హీరోగా చేస్తూనే.. కమెడియన్ గానూ నవ్వించబోతున్నాడు అన్నమాట. దీంతో ఆయన రెండు రకాల రెమ్యూనరేషన్ అందుకొన్నాడు. ఇంతకీ హీరోగా సునీల్ రెమ్యూనరేషన్ ఎంత ? మళ్లీ కమెడియన్ మారిన తర్వాత రెమ్యూనరేషన్ ఎంత ?? తెలుసుకొనేందుకు సినీ ప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు.
హీరోగా సునీల్ రూ. 4 కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకునేవాడని తెలిసింది. ఐతే, కమెడియన్ రీ-ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నాక ఆయన రెమ్యూనరేషన్ ని భారీగా తగ్గించుకొన్నట్టు సమాచారమ్. ‘సిల్లీ ఫెలోస్’ సినిమాలో సునీల్ ఒక హీరోగా చేస్తున్నాడు. మరో హీరోగా అల్లరి నరేష్ నటిస్తున్నారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు. ‘సుడిగాడు’ సీక్వెల్ గా ప్రచారం జరుగుతోన్న ఈ సినిమా కోసం సునీల్ కేవలం కోటిన్నర కోటిన్నర పారితోషికమే తీసుకున్నాడని సమాచారమ్.
ఇక, కమెడియన్ గా సునీల్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. శ్రీను వైట్ల-రవితేజల ‘అమర్ అక్భర్ ఆంథోనీ’, త్రివిక్రమ్ – తారక్ ల ‘అరవింద సమేత’ సినిమాల్లో సునీల్ కామెడీ చేయబోతున్నారు. ఈ రెండు కూడా భారీ బడ్జెట్ సినిమాలే. దీంతో సునీల్ పారితోషికంగా కోటి రూపాయలు అందుకొంటున్నాడని చెబుతున్నారు. మొత్తానికి.. హీరోగా సునీల్ రేటు కోటిన్నర, కమెడియన్ గా సునీల్ రేటు కోటిరూపాయలు అన్నమాట.