‘గూఢచారి’ బెనిఫిట్ షో టాక్

యంగ్ హీరో అడవిశేష్ ‘గూఢచారి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. ఈ తెల్లవారుజామున బెనిఫిట్ షోస్ పడిపోయాయి. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షో టాక్ ఏంటీ ? అన్నది మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది.. మీ టీఎస్ మిర్చి.

ట్రైలర్ లో చూపినట్లుగా హీరో తండ్రి ఒక యాక్షన్ సీక్వెన్స్ లోచనిపోతాడు. అడవి శేష్ పెరిగి పెద్దయి, ఇంటలిజెన్స్ ఏజెన్సీలో చేరి తన తండ్రిలా దేశానికి సేవ చేయాలనుకుంటాడు. సీనియర్ హీరోయిన్ సుప్రియ యార్లగడ్డ రా ఆఫీసర్ గా కనిపించారు. కమెడియన్ వెన్నెల కిశోర్ కూడా రా ఆఫిసర్. అయినా కామెడీ గానే కనిపించాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల శేష్ పక్కింటి అమ్మాయిగా కనిపించింది.

తొలి భాగంలో హీరో ‘రా’లో చేరడం, దానికి సంబంధించిన ట్రైయినింగ్, హీరోయిన్ తో రొమాంటిక్ సన్నివేశాలు, అప్ కమింగ్ టెర్రరిస్టుల గురించి హీరో తెలుసుకోవడం లాంటి ఆసక్తికరమైన సన్నివేశాలని చూపించారు. ఓ పెద్ద ట్విస్టుతో ఇంటర్వెల్ బ్లాక్ వచ్చింది. ఆ ట్విస్టు ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచేలా ఉంది.

సెకంఢాఫ్ లో అడవిశేష్ ప్రకాష్ – రాజ్ ల మధ్య ఎమోషనల్ సీన్స్, శేష్ టెర్రరిస్ట్ కార్యకలాపాలను డీకోడ్ చేయడం, కథలో మరో ట్విస్ట్, బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ మిషన్, శేష్ తీవ్రవాద ప్రదేశాలను కనుగొనేందుకు ప్రయత్నించే సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. క్లైమాక్స్ లో వెన్నెల కిషోర్ సంబంధించిన ట్విస్టు రిలీల్ చేయడం బాగుంది. మొత్తంగా.. గూఢచారి కథ-కథనాలు గ్రిప్పింగ్ గా సాగాయి. సినిమా రిచ్ గా వచ్చింది అని సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పుకొంటున్నారు.