ఆది పినిశెట్టి ‘యు-టర్న్’లుక్.. ట్రెండింగ్ నెం.1 !


సమంత ఇప్పటికే మంచి నటి అనిపించుకొంది. కావాల్సింత పేరు తెచ్చుకొంది. తెలుగు, తమిళ్ లోనూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఐతే, ఇకపై విభిన్నమైన సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకొంటోంది. ఈ క్రమంలో లేడీ సూపర్ స్టార్ అనిపించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ‘యు-టర్న్’లాంటి కథలని వెతికి పట్టుకుంటోంది. కన్నడ బ్లాక్‌ బస్టర్‌ ‘యు టర్న్‌’పై సమంత మనసుపడి మరీ చేసింది. మాతృక దర్శకు పవన్ కుమార్ దర్శకత్వం వహించారు.

తాజాగా, సినిమాలోని ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఓ మర్డర్ మిస్టరీ ని చేధించే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆది పినిశెట్టి లుక్ ట్రెండింగ్ నెం. 1 గా కొనసాగుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఆది లుక్ పై ట్విట్ చేస్తున్నారు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రమిది. ఒక ఫ్లై ఓవర్ మీద చనిపోతున్న మోటార్ సైకిల్ రైడర్ల కేస్ ను ఛేదించే ఓ జర్నలిస్ట్ కథ ఇది. సమంత జర్నలిస్ట్ గా నటిస్తోంది. ఆమె నటన సినిమాకే హైలైట్ గా నిలవనుందట. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ రిపోర్టర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం. శ్రీనివాస్ చిత్తూరి, రాంబాబు బండారు నిర్మాతలు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.